శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

7న ఆక్వా రైతుల ధర్నాకు ఎపి కౌలు రైతుల సంఘం మద్దతు

1 గంట క్రితం

royya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 01:08 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రొయ్యల మేత ధరలు పెంపునకు వ్యతిరేకంగా ఏడవ తేదీన మత్స్య శాఖ కమిషనర్‌ ‌కార్యాలయం వద్ద అక్వా రైతులు తలపెట్టిన ఆందోళనకు ఆంధ్రప్రదేశ్‌ ‌కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి.బలరాం, ఎం.హరిబాబులు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో రాష్ట్రంలో రొయ్యల మేత ధరలు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే బ్లాక్ టైగర్ రొయ్యల మేత రూ 24, వనామీ రొయ్యల మేత కిలో రూ.18 చొప్పున కంపెనీలు పెంచాయని, ముఖ్యమంత్రి సమక్షంలో రొయ్యల మేతల ధరలుపై జరిగిన చర్చల్లో అప్సెడా అనుమతి లేకుండా ధరలు పెంచ రాదని, పెరిగిన ధరలలో నాలుగు రూపాయల తగ్గించాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగినటువంటి ఒప్పందాన్ని కూడా అమలు చేయలేని అసమర్ధ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందా అని అనుమానం కలుగుతుందని తెలిపారు. ఆగస్టు 31 వ తారీకున రొయ్యల మేత కంపెనీలు ఫీడ్ ధరలు పెంచుతున్నట్టు ప్రకటించాయని, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా కమిషనర్ ధరలు పెరగటం లేదని చెప్పి వివరణ ఇస్తూ అవన్నీ వాస్తవ దూరమని, ధరలు పెరగలేదంటూ పత్రికలలో ప్రకటనలు చేశారని, కానీ, కానీ వాస్తవంగా ధరలు పెరిగాయని తెలిపారు. అంటే ముఖ్యమంత్రి, కమిషనర్ స్థాయి అధికారులు చెప్పేదానికి ఆచరణలో జరిగే దానికి పొంతన లేకుండా ఉందన్నారు. కంపెనీలకి ప్రభుత్వం అమ్ముడు పోయిందా అనే అనుమానం కలుగుతోందని చెప్పారు. ప్రభుత్వానికి రైతుల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అప్సడ, రైతాంగం అనుమతి లేకుండా పెంచిన ఫీడ్ ధరలను తగ్గించాలని డిమాండ్‌ ‌చేశారు. గతంలో వేసిన కమిటీ పూర్తిస్తాయిలో చర్చలు జరిపి రైతుల అంగీకారమైన ధర మాత్రమే అమలు చేయాలని సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్