సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సాగర్‌ ‌నుంచి 19 టిఎంసిలివ్వండి

1 గంట క్రితం

ap govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 11:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కెఆర్‌ఎంబికి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి

ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : నాగార్జున సాగర్‌ ‌నుంచి తాగునీటి అవసరాలకు తొమ్మిది టిఎంసిలతో పాటు కృష్ణా డెల్టాకు అదనంగా మరో పది టిఎంసిల నీళ్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం కృష్ణా రివర్‌ మేనేజ్​మెంట్​ బోర్డు (కెఆర్​ఎంబి)ని కోరింది. సాగర్‌ ‌డ్యాంలో 510 - 490 అడుగుల మధ్య డెడ్​ స్టోరేజ్​లో ఉన్న 31 టిఎంసిల జలాలను కూడా పంచాలని విజ్ఞప్తి చేసింది. అయితే, వీటిని తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. తెలంగాణ అవసరాల కోసం ఫిబ్రవరి వరకు 21 టిఎంసిలు కావాలని తెలంగాణ కోరింది. హైదరాబాద్‌‌లోని జలసౌధలో సోమవారం కృష్ణా రివర్​ మేనేజ్‌‌మెంట్‌ ‌బోర్డు త్రి సభ్య కమిటీ సమావేశం జరిగింది. తాగునీటి కోసం సాగర్​ నుంచి తొమ్మిది టిఎంసిలు కావాలన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదనపై కృష్ణా బోర్డు ఈ సమావేశాన్ని నిర్వహించింది. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశం ఎలాంటి పురోగతీ లేకుండానే ముగిసింది. బోర్డు సమావేశంలోనే ఈ అంశాన్ని తేలుస్తామని కృష్ఱా బోర్డు మెంబర్​ సెక్రటరీ సతీశ్​ కాంబోజ్​ పేర్కొన్నారు. సాగర్‌‌లో 510 నుంచి 500 అడుగుల మధ్య 16 టిఎంసిలు, 500 నుంచి 490 అడుగుల మధ్య మరో 15 టిఎంసిల నీళ్లు అందుబాటులో ఉన్నాయన్న ఆంధ్రప్రదేశ్‌ వాదనలను కృష్ణా బోర్డు తిరస్కరించింది. సాగర్​ కాల్వల నుంచి కృష్ణా డెల్టా సిస్టమ్​ (కెడిఎస్​)కు నీళ్లు తీసుకుంటామన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదనను తెలంగాణ ఇఎన్‌సి రమేశ్​ బాబు తప్పుబట్టారు. పట్టిసీమ నుంచి కూడా కృష్ణా డెల్టాకు నీళ్లు వస్తున్నాయని, పులిచింతలలో 42 టిఎంసిలు ఉన్నాయని చెప్పారు. పల్నాడు వాటర్​ గ్రిడ్​ ప్రాజెక్టుపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఇఎన్‌సి నరసింహ మూర్తి స్పందిస్తూ కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకోవడం తమ హక్కు అని పల్నాడు వాటర్​ గ్రిడ్​ పథకాన్ని గ్రామీణ నీటిసరఫరా శాఖ నిర్మిస్తున్నదని, అధికారికంగా జిఒ కూడా ఉందని తెలిపారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్