శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పెరిగిన కొబ్బరి ధర

1 గంట క్రితం

cococ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 01:10 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- వెయ్యి కాయలు రూ.22 వేలు

- 20 రోజుల్లోనే రూ.7 వేల వరకు  పెరుగుదల

- దిగుబడి తగ్గడం, మొవ్వుకుళ్లు తెగులుతో రైతులు డీలా

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : కొబ్బరి ధరలు పెరిగాయి. కొంతకాలం గా_ఆశించిన_స్థాయిలో_ధరలు_లేక_ఇబ్బందులు_ఎదుర్కొంటున్న_కొబ్బరి_రైతులకు_ప్రస్తుతం_మార్కెట్‌లో_మంచి లభిస్తోంది. అయితే, దిగుబడి తగ్గడం, మువ్వు కుళ్లు తెగులు ఆశించడంతో రైతులు డీలా పడుతున్నారు. గతంలో ఎకరాకు 800 కాయలు దిగుబడి వచ్చేది. ప్రస్తుతం 500 నుంచి 600 మధ్యలోనే దిగుబడి వస్తోంది. మరోవైపు మువ్వు కుళ్లు తెగులు తలపోటులా మారింది. పండగల_సీజన్‌_ప్రారంభం_కావడం,_కొబ్బరికాయలకు_డిమాండ్‌_పెరగడం,_ఇతర_రాష్ట్రాల_నుంచి_దిగుమతులు_తగ్గడం_వంటి_పరిణామాలు_ధరల_పెరుగుదలకు_ప్రధాన_కారణాలుగా_కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అంబాజీపేట మార్కెట్‌లో వెయ్యి కొబ్బరికాయల ధర_రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకు పలుకుతోంది. 20 రోజుల వ్యవధిలోనే ధర రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ధర పెరిగింది. కొత్తగా దింపు తీసిన, నాణ్యమైన పచ్చి కొబ్బరికాయలకు అధిక ధర లభిస్తోంది. దీంతో, కొబ్బరి తోటల నుంచి తాజాగా కాయలను దింపుతున్న రైతులకు గతంతో పోలిస్తే మెరుగైన ధర లభిస్తోంది. ​ శ్రావణం,_వినాయక_చవితితో_పెరిగిన_డిమాండ్‌_

శ్రావణమాసం_ప్రారంభం_కావడంతో_ఆలయాలు,_పూజా_కార్యక్రమాల్లో_కొబ్బరికాయల_వినియోగం_ పెరిగింది. రానున్న_వినాయక_చవితి_సందర్భంగా_కూడా_కొబ్బరికాయలకు_భారీగా_డిమాండ్‌_ఏర్పడే_అవకాశం_ఉందనివ్యాపారులు_చెబుతున్నారు._పండగల_సమయంలో__సాధారణ_రోజులతో_పోలిస్తే_గణనీయంగా వినియోగం పెరుగుతుంది. దీంతో, ముందుగానే వ్యాపారులు పెద్ద మొత్తంలో _కొనుగోలు_చేస్తున్నారు. మూడు నెలలకు పైగా నిల్వ ఉన్న కొబ్బరికాయలకు ప్రస్తుతం సుమారు రూ.17 వేల నుంచి రూ.18 వేల వరకు ధర లభిస్తుండగా, తాజాగా దింపు తీసిన కాయలకు రూ.20_వేల నుంచి రూ.22 వేల వరకు ధర పలుకుతోంది.

తమిళనాడు_నుంచి_తగ్గిన దిగుమతులు

దిగుమతులు_తగ్గడం కూడా ధర పెరుగుదలకు కారణమని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. కొబ్బరి ధరలు పెరగడంతో తమిళనాడు రైతులు పెద్ద ఎత్తున ఎండు కొబ్బరి తయారీపై దృష్టిసారిస్తున్నట్లుతెలుస్తోంది._దీంతో,_ఉమ్మడి_గోదావరి_జిల్లాలకు_తమిళనాడు_నుంచి_వచ్చే_కొబ్బరికాయల_సరఫరా_తగ్గింది. ప్రస్తుతం దిగుమతులు తగ్గడంతో కోనసీమలోని స్థానిక_కొబ్బరికాయలకు_డిమాండ్‌_పెరిగింది._

జోరుగా ​ఎగుమతులు

కోనసీమ_నుంచి_ఇతర_ప్రాంతాలకు_కొబ్బరికాయల_ఎగుమతులు_జోరందుకున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో సుమారు 1.80 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. ప్రస్తుతం రోజుకు 75_నుంచి 100_లారీల కొబ్బరి కాయలు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, రాజస్థాన్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

ధరలు స్థిరంగా ఉండట్లేదు

పండగ సీజన్‌‌లో మినహా మిగిలిన రోజుల్లో ధరలు స్థిరంగా ఉండటం లేదు. కొబ్బరి ధరలు నిలకడగా ఉండేలా చర్యలు చేపట్టాలి. ఈ సీజన్‌‌లో తోటలకు ఎరువులు వాడాలి. యాప్‌‌లో పేరు రిజిస్టర్ ‌అయిన వారికే యూరియా ఇస్తామంటున్నారు. అందరికీ యూరియా అందేలా చూడాలి. వర్షాకాలం మబ్బు తెగులు ఆశిస్తోంది. పురుగు మందులు ధరలు కూడా పెరిగాయి. వీటి ధరలను నియంత్రించాలి.


- బండారు సూర్యరామకృష్ణ, కొబ్బరి రైతు, మాచవరం గ్రామం అంబాజీ పేట మండలం

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్