సంగం- మర్రిపాడు : సంగం మండలం మర్రిపాడు గ్రామ సమీపంలోని కావలి కాలువపై దెబ్బతిన్న సైఫన్‌ను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు. సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ పులుగుంట మధుమోహన్ రెడ్డి , జలదంకి మండల కన్వీనర్ మునగాల తిరుమలరెడ్డి, సీనియర్ నాయకులు ఒంటేరు జయచంద్రారెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ పూనూరు భాస్కర్ రెడ్డి, పమిడి రవికుమార్ చౌదరి, పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర దేవాదాయ-ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు సైఫన్ దెబ్బతిన్న ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమస్యను అత్యవసరంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. సైఫన్ దెబ్బతినడంతో సాగునీటి సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున, మరమ్మతు పనులను అత్యంత వేగవంతంగా చేపట్టి నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ, రైతులకు నీటి కొరత ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలను కూడా సిద్ధం చేయాలని సూచించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సైఫన్ పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీటి సరఫరాను యథావిధిగా పునరుద్ధరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హామీ ఇచ్చారు.
కావలి కాలువ పై దెబ్బతిన్న సైఫన్‌ను పరిశీలించిన ఉదయగిరి ఎమ్మెల్యే
30 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 30, 2026, 02:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)