ప్రజాశక్తి - మామిడికుదురు (కోనసీమ) : లూటుకుర్రు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మాకనపాలెం గ్రామం నందు డాక్టర్ కె సత్యవతి, రాజోలు సబ్ యూనిట్ అధికారి వై. ఆదినారాయణ ఆదేశాలు మేరకు సోమవారం డే ఫ్రైడే పై అవగాహన కల్పించారు. వర్షాకాలం సీజన్ దృశ్యా డెంగ్యూ,మలేరియా, చికెన్ గున్యా మొదలగు వ్యాధులు కారణమైన దోమలను నిర్మూలన కొరకు దోమలనులార్వా దశ లోనే అంతమొందించుటకు గాను నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లోను, మురికి గుంటలు లోను ఎబేట్ స్ప్రే చేయించారు. అలాగే దోమలు ద్వారా వచ్చే వ్యాధులు, రాకుండా తీసుకొలసిన జాగ్రత్తలు, ఫ్రైడే డ్రైడే గూర్చి ఆరోగ్య సంరక్షణ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో హెల్త్ అసిస్టెంట్ కె. ఉమా మహేశ్వర రావు, పంచాయతీ సెక్రటరీ కె. మురళి కృష్ణ, ఎ ఎన్ ఎమ్ వి దుర్గ,ఎమ్ ఎల్పి హెష్ .సి హెష్ అరుణ,ఆశ కార్యకర్త కె దుర్గ నాగ లక్ష్మితదితరులు పాలొగొన్నారు.
మాకన పాలెం లో" డే - ఫ్రైడే "పై అవగాహన
40 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 12:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)