సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టీవీ పూల్‌ నుంచి సీఎన్‌ఎన్‌ను తొలగించిన వైట్‌హౌస్‌

56 నిమిషాల క్రితం

cnn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 12:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సీఎన్‌ఎన్‌, ఎంఎస్‌ నౌ, పొలిటికోలను వైట్‌హౌస్‌ నుంచి నిషేధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వివాదం మరింత తీవ్రమైంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం కోసం ట్రంప్‌ న్యూయార్క్‌ పర్యటనను కవర్‌ చేసేందుకు సోమవారం టెలివిజన్‌ పూల్‌ ప్రతినిధిగా వ్యవహరించాల్సిన సీఎన్‌ఎన్‌ను వైట్‌హౌస్‌ ఆ బాధ్యత నుంచి తొలగించింది. ఇప్పటికే ఆ మూడు సంస్థల జర్నలిస్టుల ప్రెస్‌ బ్యాడ్జ్‌లను నిష్క్రియం చేసి, కొందరిని వైట్‌హౌస్‌ ప్రాంగణంలోకి అనుమతించలేదని సమాచారం. ఈ చర్యలను వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్‌ అసోసియేషన్‌ విమర్శించింది. తమపై ఆంక్షలు ఉన్నప్పటికీ ప్రభుత్వ వార్తా కవరేజీ కొనసాగుతుందని సీఎన్‌ఎన్‌ తెలిపింది. ఈ వ్యవహారాన్ని మూడు మీడియా సంస్థలు న్యాయస్థానంలో సవాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్