- ముగిసిన తుదిదశ కౌన్సెలింగ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇఎపిసెట్ బైపిసి విభాగం విద్యార్థులకు సీట్ల కేటాయింపు పూర్తయింది. మొత్తం 239 కళాశాలల్లో 13,144 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 12,628 భర్తీ కాగా, 516 మిగిలాయి. ఫార్మా డిలో అన్ని సీట్లూ భర్తీ అయ్యాయి. బి ఫార్మసీ సీట్లు 11 యూనివర్సిటీ కళాశాలల్లో 763 అందుబాటులో ఉండగా, 762 భర్తీ అయ్యాయి. 135 ప్రైవేట్ కళాశాలల్లో 9,992 సీట్లకు 9,477 భర్తీ అయ్యాయి. ఫార్మ డి సీట్లు 2 యూనివర్సిటీ కళాశాలల్లో అందుబాటులో ఉన్న 55 సీట్లు, 66 ప్రైవేట్ కళాశాలల్లో ఉన్న 1,524 సీట్లు, 4 ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఉన్న 48 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ నెల 9న ప్రారంభమైన రెండోదశ కౌన్సెలింగ్‌కు 1,091 మంది రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. ఇంజినీరింగ్‌కు సంబంధించి 5 యూనివర్సిటీ కళాశాలల్లో ఉన్న 122 సీట్లు, 7 ప్రైవేట్ కళాశాలల్లోని 363 సీట్లు, 3 ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఉన్న 63 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం రెండు దశల్లో జరిగిన కౌన్సెలింగ్‌కు 24,705 మంది రిజిస్ర్టేషన్ చేసుకోగా, 15,605 మంది రెండో దశలో ఆప్షన్లు ఎంపిక చేసుకోగా, 6,226 మంది కొత్తగా అడ్మిషన్లు పొందారు. ఈ నెల 30వ తేదీలోపు విద్యార్థులు కళాశాలల్లో రిపోర్టు చేసి అడ్మిషన్ పొందాలి.








కామెంట్‌లు (0)