ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

2,050 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

16 సెప్టెంబర్, 2026

apslprb
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 12:10 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పోలీసు శాఖతో పాటు అగ్నిమాపక, కారాగార, రవాణా, ఫోరెన్సిక్‌ విభాగాల్లో 2,050 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్‌ జారీ చేసింది. సబ్‌ ఇన్‌‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, అగ్నిమాపక సిబ్బంది, కారాగార వార్డర్లు, శాస్త్రీయ సహాయకుల పోస్టులను భర్తీ చేయను న్నట్లు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 22న జారీ చేసిన ఉత్తర్వులు, అనం తరం ఆర్థికశాఖ ఈ నెల 11న ఇచ్చిన అనుమతుల మేరకు నియామక ప్రక్రియ చేపట్టినట్లు తెలిపింది. ఆయా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేసినట్లు పేర్కొంది. సబ్‌ ఇన్‌‌స్పెక్టర్ల విభాగంలో మొత్తం 438 పోస్టులు ఉన్నాయని, ఇందులో పోలీసు సబ్‌ ‌ఇన్‌‌స్పెక్టర్లు (సివిల్‌) 253, రిజర్వు పోలీసు సబ్‌ ‌ఇన్‌‌స్పెక్టర్లు 116, ప్రత్యేక రక్షణ దళంలో సబ్‌ ‌ఇన్‌‌స్పెక్టర్లు (పురుషులు) 9 పోస్టులు ఉన్నట్లు నోటిఫికేషన్‌‌లో పేర్కొంది. అలాగే సమాచార విభాగంలో పోలీసు సబ్‌ ‌ఇన్‌‌స్పెక్టర్లు 50, పోలీసు రవాణా విభాగంలో సబ్‌ ‌ఇన్‌‌స్పెక్టర్లు (పురుషులు) 10 పోస్టులను భర్తీ చేయను న్నట్లు వెల్లడించింది. పోలీసు కానిస్టేబుళ్లు, అగ్ని మాపక సిబ్బంది, కారాగార వార్డర్ల విభాగంలో మొత్తం 1,156 పోస్టులు ఉన్నాయని, వీటిలో సివిల్‌ పోలీసు కానిస్టేబుళ్లు 542, రిజర్వు పోలీసు కానిస్టేబుళ్లు 285 పోస్టులు ఉన్నాయని, రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల విభాగంలో అగ్నిమాపక సిబ్బంది 158, కారాగారాల సేవల విభాగంలో పురుష వార్డర్లు 150, మహిళా వార్డర్లు 21 పోస్టులు ఉన్నాయని తెలిపింది. పోలీసు సమాచార విభాగంతో కలిపి 200 పోలీసు కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేయను న్నట్లు వెల్లడించింది. పోలీసు రవాణా సంస్థలో 213 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయని, ఇందులో యాంత్రిక విభాగంలో 15, డ్రైవర్‌ విభాగంలో 198 పోస్టులు భర్తీ చేయనున్నట్లు, ఈ పోస్టులు పురుషులకు సంబంధిం చినవిగా పేర్కొన్నారు. శాస్త్రీయ సహాయకుల విభాగంలో మొత్తం 43 పోస్టులు ఉన్నాయని, భౌతిక శాస్త్ర విభాగంలో 10, రసాయన శాస్త్ర విభాగంలో 13, జీవశాస్త్రం విభాగంలో 20 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ భర్తీ ప్రక్రియకు సంబంధించి.. ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు కచ్చితమైన తేదీలను, ప్రాథమిక రాత పరీక్ష వివరాలను ప్రత్యేకంగా పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించనున్నట్లు పేర్కొంది. అర్హత నిబంధనలు, ఇతర వివరాలను అభ్యర్థులు పూర్తిగా పరిశీలించుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోవాలని నియామక మండలి సూచించింది. దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్‌ slprb.ap.gov.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో సమర్పించాలని స్పష్టం చేసింది. అయితే, నిరుద్యోగుల నుంచి పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్‌ ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం 2,050 పోస్టలు భర్తీకి మాత్రమే నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. రాష్ట్రంలో కాకినాడ కేంద్రంగా ఈ నెల 7న పోలీసు శాఖలోని 20 వేల ఖాళీలను భర్తీ చేయాలని నిరుద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. ర్యాలీ అనంతరం కలెక్టరేట్‌ ‌ముట్టడించిన విషయం విధితమే. ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా తాజా నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్