న్యూఢిల్లీ : జాకీర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్‌ఎఫ్)పై కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లపాటు నిషేధాన్ని పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఐఆర్‌ఎఫ్‌పై నిషేధాన్ని పొడిగించడం ఇది మూడోసారి. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) కింద 2016లో తొలిసారిగా కేంద్రం ఈ సంస్థను చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించింది. 2021లో మరో ఐదేళ్లపాటు నిషేధాన్ని పొడిగించింది. ఉపా చట్టం-1967లోని సెక్షన్ 3, ఉప సెక్షన్లు (1), (3) కింద ఉన్న అధికారాలను వినియోగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఐఆర్‌ఎఫ్‌ను చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచి ఐదేళ్లపాటు అమల్లో ఉంటుందని పేర్కొంది. సంస్థ చట్టవిరుద్ధ కార్యకలాపాలను వెంటనే అరికట్టకపోతే, విధ్వంసక కార్యకలాపాలను కొనసాగించడంతోపాటు పరారీలో ఉన్న కార్యకర్తలను తిరిగి సమీకరించుకునే అవకాశం ఉందని కేంద్రం నోటిఫికేషన్‌లో పేర్కొంది. మత సామరస్యాన్ని దెబ్బతీయడం, దేశ లౌకిక స్వరూపానికి విఘాతం కలిగించడం, దేశ వ్యతిరేక భావాలను వ్యాప్తి చేయడం, తీవ్రవాదానికి మద్దతు ఇవ్వడం వంటి కార్యకలాపాలకు పాల్పడే ప్రమాదం ఉందని తెలిపింది. జాకీర్ నాయక్ ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నారు. ఆయనపై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసి 2017లో ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2016లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ కేఫ్‌పై జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్నవారు నాయక్ ప్రసంగాల వల్ల ప్రభావితమయ్యారని అప్పట్లో ఆరోపణలు రావడంతో ఆయనపై దర్యాప్తు ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన భారత్‌ను విడిచి వెళ్లారు. తన పీస్ టీవీ, సోషల్ మీడియా ద్వారా వివిధ మతాల మధ్య విద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నారని నాయక్‌పై ఆరోపణలు ఉన్నాయి.
ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై మరో ఐదేళ్ల నిషేధం
10 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 13, 2026, 12:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)