ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

22,316 దరఖాస్తులు పెండింగ్

14 నవంబర్, 2026

delhirao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 07:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఫారం-19 (ఓటరు నమోదు) దరఖాస్తుల పరిశీలనలో 22,316 పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు తెలిపారు. పశ్చిమ, తూర్పుగోదావరి, కృష్ణా– గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తంగా 31,952 ఓటరు నమోదుకు దరఖాస్తులొచ్చాయని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు 9,502 దరఖాస్తులను ఆమోదించామని, 134 దరఖాస్తులను తిరస్కరించామని వెల్లడించారు. రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల పరిధిలోని 227 మండలాల నుంచి ఈ దరఖాస్తులు అందాయని, వీటిలో 18,739 ఆన్‌లైన్, 13,213 ఆఫ్‌లైన్ ద్వారా స్వీకరించామని పేర్కొన్నారు. ఉమ్మడి పశ్చిమ–తూర్పుగోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 16,809 దరఖాస్తులు అందగా, 6,949 ఆమోదించామని, 82 తిరస్కరించగా, 9,778 పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15,143 దరఖాస్తులు అందగా, 2,553 ఆమోదించగా, 52 తిరస్కరించామని, 12,538 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఓటరు నమోదు దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్