ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థలకు ఈ నెల 26న నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, రాష్ట్ర వ్యాప్తంగా 63.44 శాతం ఓటింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,009 వార్డులకు పోలింగ్ నిర్వహించగా, 24,98,312 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులుగా ఉన్నారని పేర్కొన్నారు. వీరిలో 15,85,031 మంది ఓటు వేశారని, పోలింగ్ శాతం 63.44గా నమోదైందని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని తెలిపారు. ఓటర్లు తమ హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు, ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)