శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పల్లెపోరులో టిడిపి జోరు

18 నిమిషాల క్రితం

voting
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 12:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- అల్లూరిలో వైసిపి ముందంజ

- సిపిఎం - 5, సిపిఐ - 1 , సిపిఐ ఎంఎల్‌ -1 , కాంగ్రెస్‌ -2

ప్రజాశక్తి-యంత్రాంగం: రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సమరంలో టిడిపి మద్దతుదారులు అధిక స్థానాలను కైవసం చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో టిడిపి కన్నా వైసిపి మద్దతుదారులు అధిక స్థానాల్లో గెలుపొందారు.శ్రీసత్యసాయి జిల్లా, పోలవరం ప్రాంతాల్లో టిడిపి అభ్యర్థులకు వైసిపి మద్దతుదారులు గట్టి పోటీనిచ్చారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో జనసేన పార్టీ మద్దతుదారులు తన బలాన్ని పుంజుకుంటోంది. సిపిఎం మద్దతుదారులు ఐదుస్థానాల్లో విజయం సాధించగా, ఏలూరు జిల్లాలో సిపిఐ ఒక స్థానాన్ని గెలుచుకుంది. కోనసీమ జిల్లాలో కాంగ్రెస్ మద్దతుదారులు రెండు పంచాయతీలను కైవసం చేసుకున్నారు.

తొలి విడతలో 77.65 % పోలింగ్

ఎస్‌ఇసి ప్రకటన రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 77.65 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా తెలిపారు. ఈ నెల 26న నిర్వహించిన పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 83.37, విజయనగరం జిల్లాలో 83.33 శాతం చొప్పున పోలింగ్‌ నమోదైందన్నారు.


గెలిచిన మద్దతుదారుల జాబితా...


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్