బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కోటికి చేరుకున్న ‘ఇంటింటికి టిడిపి’

04 సెప్టెంబర్, 2026

lokesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 01:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- 40 రోజుల్లో 73.6శాతం ఇళ్ల సందర్శన

- హర్షం వ్యక్తం చేసిన లోకేష్‌

‌ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రెండేళ్ల కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడపకూ చేరవేసేందుకు టిడిపి నిర్వహిస్తున్న ‘ఇంటింటికీ టిడిపి’ కోటి ఇళ్లకు చేరింది. ఈ కార్యక్రమం 40వ రోజుకు చేరుకునే నాటికి రాష్ట్రవ్యాప్తంగా కోటి ఇళ్ల సందర్శన మైలురాయిని విజయవంతంగా అధిగమించిందని ఆ పార్టీ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం ఒక్క రోజే అదనంగా మరో 1.30 లక్షల ఇళ్లను సందర్శించడంతో మొత్తం సందర్శనల సంఖ్య కోటికి చేరిందని వెల్లడించింది. రాష్ట్రంలో 1,35,91,105 ఇళ్లు ఉండగా, ఇప్పటివరకు సందర్శించిన ఇళ్ల సంఖ్య మొత్తం ఇళ్లలో 73.6 శాతానికి చేరినట్లు తెలిపింది. ఈ 40 రోజుల్లో ఒకే రోజులో అత్యధికంగా 19,405 బూత్‌లలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఒక గరిష్ఠ రికార్డు అని వెల్లడించింది.ఒకే రోజులో ఏకంగా 28,397 మంది కార్యకర్తలు క్షేత్రస్థాయి పర్యటనల్లో పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించారని పేర్కొంది.క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త సగటున రోజుకు 12 ఇళ్లను పలకరిస్తున్నారని, మొదటి వారం తర్వాత నుంచి ఈ వేగం ఎక్కడా తగ్గకుండా స్థిరంగా కొనసాగుతుండటం పార్టీ శ్రేణుల క్రమశిక్షణకు నిదర్శనమని వెల్లడించింది. ఆగస్టు 8వ తేదీన ఒకే రోజులో అత్యధికంగా 3,51,229 ఇళ్లను సందర్శించారని తెలిపింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుందని పేర్కొంది.

కార్యకర్తల అంకితభావానికి ప్రతీక: లోకేష్

కోటి ఇళ్ల మైలురాయిని చేరుకోవడంపై టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత వెనుక ప్రతి టిడిపి కార్యకర్త కృషి, అంకితభావం, క్రమశిక్షణ కీలకంగా నిలిచాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కోటి ఇళ్ల మైలురాయి కేవలం ఒక సంఖ్య కాదని, లక్షలాది కార్యకర్తల శ్రమ, సమయం, సమన్వయం, అంకితభావానికి ప్రతీక అని తెలిపారు. కోటి ఇళ్ల మైలురాయి పార్టీ కార్యకర్తల శ్రమకు ప్రతీక అని, ఈ విజయం పూర్తిగా పార్టీ శ్రేణులదేనని రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని వివరించడంతో పాటు వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్