రావల్పిండి: శ్రీలంకతో జరిగిన మూడు టి20ల సిరీస్ను ఆతిథ్య పాకిస్తాన్ జట్టు 2-1తో చేజిక్కించుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన మూడో, చివరి టి20లో పాకిస్తాన్ జట్టు 8వికెట్ల తేడాతో ఓటమిపాలైనా.. సిరీస్ను చేజిక్కించు కుంది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కెప్టెన్ ఫర్హాన్(76) అర్ధసెంచరీకి తోడు మిన్హాస్(34) మాత్రమే బ్యాటింగ్లో రాణించారు. శ్రీలంక బౌలర్లు శనకకు మూడు, తుషారా, ఈషన్ మలింగకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ లక్ష్యాన్ని శ్రీలంక కేవలం 2 వికెట్లు కోల్పోయి 17.1ఓవర్లలోనే ముగించింది. ఓపెనర్ ఉదాన(1), జయవర్ధనే(38) నిరాశపరిచినా.. కెప్టెన్ కుశాల్ మెండీస్(87), కమిందు మెండీస్(40) మరో వికెట్ పడకుండా మ్యాచ్ను ముగించారు. పాకిస్తాన్ బౌలర్లు ఇమ్రాన్, అరాఫత్కు ఒక్కో వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కుశాల్ మెండీస్కు, సిరీస్ ఫర్హాన్కు దక్కాయి. ఇరుజట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ నవంబర్ 9నుంచి ప్రారంభం కానుంది.
Print Editionటి20 సిరీస్ విజేత పాకిస్తాన్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 15, 2026, 01:18 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)