హోప్ సెంచరీ
కీమో పాల్‌కు ఐదు వికెట్లు
నాల్గో టి20లో వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఓటమి
హైదరాబాద్: రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన నాల్గో టి20లో టీమిండియా భారీ ఛేదనలో పోరాడి ఓడింది. విండీస్ నిర్దేశించిన 248పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 19.3 ఓవర్లలో 223 పరుగులే చేసింది. దీంతో 24 పరుగుల తేడాతో నెగ్గిన విండీస్ ఐదు టి20ల సిరీస్‌ను 2-2తో సమం చేయగా.. ఐదో, చివరి టి20 చిదంబరం స్టేడియం వేదికగా శనివారం జరగనుంది. తొలుత విండీస్ ఓపెనర్, కెప్టెన్ అజేయ శతకంతో రాణించడంతో ఆ జట్టు 247 పరుగుల భారీస్కోర్ చేసింది. అనంతరం టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్(56) అర్ధసెంచరీకి తోడు హైదరాబాద్ ఆటగాళ్లు నితీశ్‌కుమార్ రెడ్డి(41), తిలక్ వర్మ(43) ధనా ధన్ ఇన్నింగ్స్‌తో రాణించినా కీలక దశలో ఔటయ్యారు. ఇషాన్ కిషన్(6), శ్రేయస్(16), నమన్ ధీర్(0), అక్షర్ పటేల్(3) స్వల్ప స్కోర్లకే ఔటై నిరాశపరిచా రు. విండీస్ బౌలర్ కీమో పాల్‌కు ఐదు వికెట్లు, స్పింగర్కు ఒకటి, మోటీకి రెండు వికెట్లు దక్కాయి.
తొలిగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ను కెప్టెన్, వికెట్ కీపర్ షాయ్ హోప్, జువెల్ ఆండ్రూ(21) ఆదుకున్నారు. ఆ తర్వాత షిమ్రన్ హెట్‌మైర్ మెరుపులు (33)తో హోప్ రెండో వికెట్‌కు 24 బంతుల్లో 58 పరుగులు జోడించాడు. ఇక రోవ్‌మన్ పావెల్ (24) ఫర్వాలేదనిపించగా.. హోప్‌తో కలిసి రూథర్‌ఫర్డ్ నాలుగో వికెట్‌కు 43 బంతుల్లో 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో రూథర్‌ఫర్డ్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక హోప్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్సర్ బాది శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 50 బంతులు ఎదుర్కొన్న హోప్.. 4 ఫోర్లు, 9 సిక్సర్లకు 102 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హోప్‌కు లభించగా.. ఐదో, చివరి టి20 ఎం. చిదంబరం స్టేడియం వేదికగా శనివారం జరగనుంది.
స్కోర్‌బోర్డు...
వెస్టిండీస్ ఇన్నింగ్స్: హోప్ (నాటౌట్) 102, ఆండ్రూ (ఎల్బి)అక్షర్ పటేల్ 21, హెట్‌మైర్ (సి అండ్ బి)ప్రిన్స్ యాదవ్ 33, రువాన్ పావెల్ (సి)సంజు (బి)ఆర్ష్‌దీప్ 24, రూథర్డ్ఫోర్డు (నాటౌట్) 49, అదనం 18. (20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 247పరుగులు.
వికెట్ల పతనం: 1/52, 2/110, 3/156
బౌలింగ్: మయాంక్ 4-0-52-0, ఆర్ష్‌దీప్ 4-0-52-1, ప్రిన్స్ 4-0-36-1, అక్షర్ 4-0-45-1, నమన్ ధీర్ 1-0-19-0, నితీశ్ 3-0-39-0.
ఇండియా ఇన్నింగ్స్: సంజు (సి)హెట్‌మైర్ (బి)కీమో పావెల్ 56, అభిషేక్ (సి)స్ప్రింగర్ (బి)మోటీ 29, ఇషాన్ (సి)ఆండ్రూ (బి)కీమో పాల్ 6, శ్రేయస్ (సి)ఆండ్రూ (బి)స్ప్రింగర్ 16, తిలక్ వర్మ (సి)రువాన్ పావెల్ (బి)షెఫర్డ్ 43, నమన్ ధీర్ (స్టంప్)హోప్ (బి)మోటీ 0, నితీశ్ కుమార్ (సి)రువాన్ పావెల్ (బి)కీమో పాల్ 41, అక్షర్ (సి)రూథర్డ్ఫోర్డు (బి)కీమో పాల్ 3, ప్రిన్స్ (బి)కీమో పాల్ 0, ఆర్స్దీప్ (రిటైర్డ్ఔట్) (బి)జోసెఫ్ 5, మయాంక్ (నాటౌట్) 0, అదనం 24. (19.3ఓవర్ల లో ఆలౌట్) 223 పరుగులు.
వికెట్ల పతనం: 1/60, 2/67, 3/97, 4/130, 5/130, 6/200, 7/212, 8/212, 9/213, 10/223
బౌలింగ్: ఛేస్ 4-0-43-0, జోసెఫ్ 2.3-0-47-0, షెఫర్డ్ 3-0-32-1, పాల్ 4-0-41-5, స్ర్పింగర్ 4-0-40-1, మోటీ 2-0-13-2.






కామెంట్లు (0)