కరుణ్ నాయర్ అద్భుత బ్యాటింగ్‌తో కర్ణాటకకు ఊరట
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : ఆంధ్ర, కర్ణాటక జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ డ్రాగా ముగిసింది. నాలుగో రోజు కర్ణా టక జట్టు రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కర్ణాటక జట్టు ను కష్టాల నుంచి గట్టెక్కించ డంలో కరుణ్ నాయర్ కీలక పాత్ర పోషించారు. అద్భుతమైన బ్యా టింగ్‌తో జట్టుకు మెరుగైన స్కోరు అందించి, ఆంధ్ర జట్టు విజయావకాశాలను దెబ్బతీశారు. కర్ణాటక రెండో ఇన్నింగ్స్‌లో ఆంధ్ర బౌలర్లు సమర్థంగా రాణించారు. ఎల్. మోహన్ ఐదు వికెట్లు పడగొట్టి సత్తాచాటగా, ఎస్. కుమార్ మూడు వికెట్లు, టి విజయ్ ఒక వికెట్ సాధించారు. కర్ణాటక నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆంధ్ర జట్టు తరఫున తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో ఆకట్టుకున్న ఎస్.వి. రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించారు. 85 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లతో 35 పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో శిఖర్ శెట్టి రెండు వికెట్లు, బత్కల్, బజాజ్ చెరో వికెట్ సాధించారు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ఎస్.వి. రాహుల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యారు.
కేఎల్ రాహుల్‌ను చూసేందుకు అభిమానుల సందడి
భారత స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు నాలుగు రోజుల పాటు మూలపాడు స్టేడియానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మూలపాడు వేదికగా జరిగిన రంజీ మ్యాచ్‌తో ఆంధ్రలో క్రికెట్ సందడి నెలకొంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్ బాబు మరిన్ని ప్రతిష్ఠాత్మక క్రికెట్ మ్యాచ్‌లను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి, స్థానిక క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఇటువంటి మ్యాచ్‌లు దోహదపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.







కామెంట్లు (0)