ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్ర వ్యాప్తంగా 758 సర్పంచులు ఏకగ్రీవం

1 గంట క్రితం

local
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 11:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- వార్డుల్లోనూ 14,727 మంది

- తొలి విడతలో 3,191 పంచాయతీల్లో పోలింగ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు అధికంగా నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 758 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వార్డు సభ్యుల స్థానాల్లోనూ 14,727 మంది ఏకగ్రీవమయ్యారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం ఒకటో విడత సర్పంచ్, వార్డు సభ్యులు వివరాలను వెల్లడించింది. తొలి విడతలో 3,949 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు ప్రకటించగా, 3,191 స్థానాలకు ఈ నెల 26న పోలింగ్‌ జరగనుంది. వీటి కోసం 9,052 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వార్డు సభ్యులు 39,832 స్థానాలకు ఎన్నికలు ప్రకటించగా, 14,727 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 25,061 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో 53,678 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో తొలి విడతలో ఎన్నికలు లేవు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్