ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

AP: నేడు మోస్తరు వర్షాలు...

21 నిమిషాల క్రితం

Depression in the Bay of Bengal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 12:40 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: తూర్పు గాలుల్లో ఏర్పడిన ఒక ద్రోణి నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణితో విలీనమైందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా సోమవారం కోస్తాంధ్రప్రదేశ్‌, యానాం, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకట్రెండు చోట్ల పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్