ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బిస్లరీ వాటర్ సురక్షితం కాదు

20 నిమిషాల క్రితం

vbesa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 12:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- నిర్దేశిత ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధమైన పదార్థాలు

- ఎఫ్ఎస్ఎస్ఎఐ

​న్యూఢిల్లీ : ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లెరీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ కంపెనీకి చెందిన నీటి నమూనాలో నిర్దేశిత ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధమైన పదార్థాలు గుర్తించినట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై చట్టపరమైన చర్యలకు అనుమతి మంజూరు చేసింది. ఎఫ్ఎస్ఎస్ఎఐ ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది. కంపెనీ నుంచి సేకరించిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాను పరీక్షించగా, అందులో బ్రోమేట్ పరిమితులు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేవని గుర్తించారు. ఆ నమూనాను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 ప్రకారం సురక్షితం కానిదిగా ప్రకటించారు.

మరోసారి పరీక్షించినా అదే ఫలితం

తొలుత వచ్చిన పరీక్షా ఫలితాలపై బిస్లెరీ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పీల్ చేసింది. దీంతో సంబంధిత నీటి నమూనాను మరింత విశ్లేషణ కోసం రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లోనూ ఆ నమూనా సురక్షితం కాదని తేలింది. ముఖ్యంగా పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ( పిఎహెచ్ఎస్) ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించినట్టు ఎఫ్ఎస్ఎస్ఎఐ వెల్లడించింది. రెండు దశల పరీక్షల్లోనూ ప్రతికూల ఫలితాలు రావడంతో ఆహార భద్రతా చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారించిన అధికారులు.. బిస్లెరీ సంస్థపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్