- దరఖాస్తులకు 19 తేదీ వరకు అవకాశం
- వివరాలు వెల్లడించిన ఎంఈఓ ఎన్. అశ్వనీ కుమార్
ప్రజాశక్తి - గిద్దలూరు: గిద్దలూరు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీలో భాగంగా 9 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు మంజూరైనట్లు మండల విద్యాశాఖాధికారి-1 నల్లబోతుల అశ్వనీ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 19వ తేదీలోగా తమ విద్యార్హతల ధ్రువపత్రాల ప్రతులతో పాటు ధరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు. ఎంపికైన ఉపాధ్యాయులు సెప్టెంబర్ 1 నుండి 2027 ఏప్రిల్ 30 వరకు నిర్ణీత పాఠశాలల్లో విధులను నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మండల పరిధిలోని నిరుద్యోగ అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంఈఓ అశ్వని కుమార్ కోరారు.







కామెంట్‌లు (0)