ప్రజాశక్తి - రాంబిల్లి (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో వయోభారాన్ని సైతం లెక్కచేయకుండా 110 ఏళ్ల వయస్సులో ఓ స్వాతంత్య్ర సమరయోధురాలు తన ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యంపై తనకున్న నిబద్ధతను చాటుకున్నారు. దిమిలి గ్రామానికి చెందిన ఆమె పేరు డబ్బీరు ఆదిలక్ష్మి. గురువారం దిమిలిలోని పోలింగ్ కేంద్రం నెంబర్ 13/10లో ఓటు వేశారు. ఆమె స్వయంగా ఓటరు స్లిప్ ద్వారా తన వివరాలను తెలుసుకుని, పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ఆమె మాట్లాడుతూ.. తన జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఓటు హక్కును వినియోగించుకున్నానని ఆనందం వ్యక్తం చేశారు.
Print Editionఓటు వేసిన స్వాతంత్ర్య సమరయోధురాలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 05, 2026, 11:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)