mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

క్రాంతికుమార్ మృతిపై న్యాయవిచారణ జరిపించాలి

6 గంటల క్రితం

dsmm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 09:36 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

-ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణం

-కుటుంబ సభ్యులను పరామర్శించిన డిఎస్ఎంఎం నాయకులు వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి- విజయవాడ అర్బన్ : సిఐ నాగరాజు వేధింపుల కారణంగా పేరుపోగు క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకోవడంపై న్యాయవిచారణ జరిపించాలని, మృతుని కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని దళిత శోషణ ముక్తి మంచ్ జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు పెరిపోగు వెంకటేశ్వరరావు కుమారుడు క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకొని మరణించిన నేపథ్యంలో కుటుంబసభ్యులను ఆదివారం ఆయన పరామర్శించారు. క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను మృతుని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీసుల వేధింపుల కారణంగా క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. తొలుత సహజ మరణంగానే భావించారని, అయితే, క్రాంతికుమార్ సెల్ఫీ వీడియో బయటకు

రావడంతో ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పారు. ఈ వీడియో చూసిన తర్వాత పోలీసుల వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ణారణ అవుతోందని, దీనిపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. క్రాంతికుమార్ కుటుంబాన్ని ఆదుకోవటంతోపాటుగా ఆయన భార్యకు ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని శ్రీనివాసరావు కోరారు. విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని, ఇది సరైనది కాదని అన్నారు. పేదలు, దళితుల పట్ల పోలీసులు చులకన భావంతో ఉంటున్నారని, ఇందుకు క్రాంతికుమార్ పై వేధింపులే కారణమని పేర్కొన్నారు. ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు డి.రమాదేవి మాట్లాడుతూ క్రాంతికుమార్ పట్ల పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని, ఇది పోలీసులు చేసిన హత్య అని అన్నారు. క్రాంతికుమార్ తండ్రి ప్రజా ఉద్యమకారుడని, ఆయన కుమారుడిని పోలీసులు వేధించి ఆత్మహత్య చేసుకునే విధంగా చేయడం బాధాకరమని అన్నారు. కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ దళితుల పట్ల పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. క్రాంతికుమార్ ను విచారణ పేరుతో స్టేషన్ కు తీసుకెళ్లి అనేక విధాలుగా వేధించారని, ఆత్మహత్య చేసుకునేంతలా వ్యవహరించారని వివరించారు. దీనిపై విచారణ జరిపి సిఐపైనా, కారకులైన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో కెవిపిఎస్ ఎన్టిఆర్ జిల్లా అధ్యక్షులు గుండిమెడ క్రాంతికుమార్, తూర్పు సిటీ అధ్యక్షులు ఎన్.శ్యామ్ బాబు, ఐద్వా నాయకులు రత్నమాల తదితరులు ఉన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్