సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

స్నేహబంధం

1 గంట క్రితం

image
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 03:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హాయ్ ఫ్రెండ్స్‌,

మా పాఠశాలలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మా పాఠశాల కరస్పాండెంట్‌ వల్లభనేని మురళీకృష్ణ గారు, ప్రిన్సిపాల్‌ వల్లభనేని నాగలక్ష్మి గారు ‘ఫ్రెండ్‌షిప్‌ డే’ సందేశాన్ని అందించారు. “అన్ని బంధాల్లోకెల్లా స్నేహబంధమే విలువైనది. స్నేహబంధాన్ని మరింత దృఢంగా మార్చే లక్ష్యంతో మన దేశంలో ఏటా ఆగస్టు మొదటి ఆదివారం ‘స్నేహితుల దినోత్సవాన్ని’ నిర్వహిస్తారు. మనందరికీ జీవితంలో వివిధ దశల్లో స్నేహితులు ఉంటారు. వారిలో కొందరు కొంతకాలం మాత్రమే మనతో పయనిస్తే, మరికొందరు జీవితాంతం మన కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ, ఉన్నత స్థానాలకు చేరేలా ప్రోత్సహిస్తారు” అని మా మాస్టార్లు చాలా చక్కగా వివరించారు. ఇంకా మాకు కొన్ని మంచి సూచనలు కూడా చేశారు. “మీ స్నేహితుడు ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసినప్పుడు, తన బాధను మీతో పంచుకునే అవకాశం ఇవ్వండి. వెంటనే పరిష్కారాలు లేదా సలహాలు చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా మంచి స్నేహితుడిగా అతనికి తోడుగా ఉండండి” అని చెప్పారు. ఈ సందేశం మాకెంతో నచ్చింది. ఆ రోజు మేమంతా ఒకరికొకరం ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్లు కట్టుకున్నాం. “హ్యాపీ ఫ్రెండ్‌షిప్‌ డే” అని చెప్పుకుంటూ రోజంతా ఎంతో ఆనందంగా గడిపాం.

- జి. జీవన, 2వ తరగతి

బచపన్‌ ప్లే స్కూలు,

తాడేపల్లి, తాడేపల్లి మండలం

గుంటూరు జిల్లా



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్