గురువారం, 12 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపెట్టుబడిదారుల రక్షణకు ప్రత్యేక చట్టం

21 నిమిషాల క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 12:24 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • చంద్రబాబు ప్రకటన

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : దేశ వ్యాప్తంగా కార్మిక చట్టాలు నీరుగారు తున్నాయి. కార్మికుల భద్రత ప్రశ్నార్ధకంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్‌ ‌కోడ్‌‌లతో కార్మికలోకం ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పనిదినానికి ముప్పు ఏర్పడింది. పని ప్రదేశాల్లో కార్మికుల ప్రాణాలు పోయినా, దిక్కులేని పరిస్తితి ఏర్పడుతోంది. కార్మికసంఘాలు హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నాయి. అయినా, వీటి గురించి ఎప్పుడూ మాట్లాడని సిఎం చంద్రబాబునాయుడు తాజాగా పెట్టుబడిదారుల రక్షణకోసం చట్టం తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు.

విశాఖ సిఐఐ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పెట్టుబడిదారుల రక్ష‍ణ కోసం చట్టం తీసుకొస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన కాన్సెప్ట్‌ ‌నోట్ ఇప్పటికే తయారైందని, దీనిపై పెట్టుబడి దారుల అభిప్రాయాలు తీసుకుని, త్వరలో జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపె డతామని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన తరువాత కేంద్రానికి పంపుతామని, దీనిని జాతీయ స్థాయి చట్టంగా మార్చి దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేసేలా చూడాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు. పరిశ్రమలకు కేటాయించిన భూమి విస్తీర్ణం, కేటాయించిన స్థలం, మంజూరు చేసిన రాయితీలు, అనుమతులను ప్రభుత్వాలు మారిన ప్పుడల్లా ఏకపక్షంగా మార్చకుండా నిరోధించడం ఈ చట్టం లక్ష్యమని ఆయన చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్