బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబలహీనపడిన ‘అర్నబ్‌’

1 గంట క్రితం

Cyclone  Arnab
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 11:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • నేడు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అర్నబ్ తుపాను వాయువ్య దిశగా కదులుతూ బుధవారం తెల్లవారుజామున 2 నుండి 8 గంటల సమయంలో బాపట్ల-విశాఖపట్నం మధ్య, నరసాపురం సమీపంలో తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. బుధవారం రాత్రికి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని, ఇది తుపానుగా బలహీనపడిందని, రాత్రికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని ఆ సంస్థ డైరెక్టర్‌ ‌ప్రఖర్‌ ‌జైన్‌ ‌బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీని ప్రభావంతో గురువారం నాడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో అత్యవసర సహాయక చర్యల కోసం 16 ఎన్‌‌డిఆర్ఎఫ్, 11 ఎస్‌‌డిఆర్‌ఎఫ్‌ బృందాలను పలు జిల్లాల్లో మోహరించినట్లు తెలిపారు. వీటితో పాటు అగ్నిమాపక సిబ్బంది, పోలిసు బృందాలు స్థానికంగా చెట్లు తొలగింపు వంటి పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్