ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మున్సిపల్ పాఠశాలల్లో అకడమిక్ ఇన్ స్ర్టక్టర్లను నియమించాలని వైసిపి టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేశవరపు జాలిరెడ్డి, షేక్ జంషీద్ కోరారు. మున్సిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతీవ్రమవుతున్న కారణంగా విద్యార్థుల విద్యాభ్యాసం తీవ్రంగా దెబ్బతింటోందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా అనేక మున్సిపల్ పాఠశాలల్లో మంజూరైన పోస్టులు ఖాళీగా ఉండటంతో ఒకే ఉపాధ్యాయుడు రెండు, మూడు తరగతులను బోధించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. కొన్నిచోట్ల ప్రధానోపాధ్యాయులే తరగతులను నిర్వహించాల్సి వస్తోందని తెలిపారు. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల అభ్యాస నైపుణ్యాలు క్షీణిస్తున్నాయని పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులకు నాణ్యమైన బోధన అందక ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదముందని తెలిపారు. ఉపాధ్యాయుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే మున్సిపల్ పాఠశాలల్లో
వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా సమస్య పరిష్కారానికి కొన్ని చోట్ల అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను తక్షణమే నియమించి విద్యార్థుల బోధనకు అంతరాయం లేకుండా చూడాలని కోరారు.








కామెంట్‌లు (0)