మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎఇఇ పరీక్షలు తొలిరోజు ప్రశాంతం

23 ఆగస్టు, 2026

aee
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 08:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ ‌సంస్థల్లో విడుదల చేసిన అసిస్టెంట్‌ ఎగ్జీక్యూటీవ్‌ ఇంజనీర్‌(ఎఇఇ) పోస్టుల భర్తీ పరీక్ష తొలిరోజు ప్రశాంతంగా జరిగింది. కంప్యూటర్‌ ఆధారితంగా జరిగిన సివిల్‌ ఇంజనీరింగ్‌ ‌విభాగం పరీక్షకు 16,183 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా 12,301(76శాతం) మంది హాజరయ్యారు. 94 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈ పరీక్ష పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో, పటిష్టమైన భద్రాత ఏర్పాట్లు మధ్య పరీక్ష జరిగిందని ట్రాన్స్‌‌కో జెఎండి సూర్యసాయి ప్రవీణ్‌‌చంద్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు రెండో సెషన్‌‌లో పరీక్ష జరిగిందని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణను విద్యుత్‌ ‌సౌధలో ఏర్పాటు చేసిన కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌నుంచి జెఎండి పర్యవేక్షించడంతో పాటు విజయవాడలోని ఎనికేపాడు వద్ద ఏర్పాటు చేసిన విజయదుర్గా ఐటీ ఇన్ఫో సొల్యూషన్స్‌ ‌పరీక్ష కేంద్రాన్ని ఆయన సందర్శించి తనిఖీ చేశారు. 24వ తేదిన మెకానికల్‌ పరీక్షకు 9,444 మంది, 25వ తేదిన జరిగే టెలికాం/ఎలక్ర్టానిక్స్‌ ‌పరీక్షకు 26,237మంది, 26,27 తేదీల్లో జరిగే ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్ పరీక్షకు 53,702 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్