చెన్నై: 'తైమామన్ తంగ మోతిరం తిట్టం' (మేనమామ ఇచ్చే బంగారు ఉంగరం పథకం)ను తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సోమవారం ప్రారంభించారు. టివికె ఇచ్చిన ఎన్నికల హామీ భాగంగా మదురైలోని ప్రభుత్వ రాజాజీ జనరల్ ఆసుపత్రిలో దీన్ని ప్రారంభించి విజయ్ స్వయంగా మదురై ఆసుపత్రిలో నవజాత శిశువులకు ఉంగరాలను అందజేశారు ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే శిశువులకు ఒక గ్రాము బరువున్న 22 క్యారెట్ల బంగారు ఉంగరం అందచేస్తారు. ఈ ఏడాది జూన్ 22 (సిఎం విజయ్ పుట్టినరోజు) లేదా ఈ తరువాత జన్మించే పిల్లలు పథకానికి అర్హులు. ఈ పథకం కోసం రూ. 755.83 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, తమిళనాడులో ప్రతి ఏటా సుమారు 7.80 లక్షల మంది పిల్లలు జన్మిస్తుండగా, వీరిలో 4.20 లక్షల ప్రసవాలు ప్రభుత్వ సంస్థలలో జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో విజయ్ తనను తాను తమిళ మహిళల సోదరుడిగా ప్రకటించుకున్నారు. మేనమామగా వారి పిల్లలను చూసుకుంటానని వాగ్దానం చేశారు. సోమవారం ఈ పథకం ప్రారంభం అనంతరం విజయ్ మదురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటన సందర్భంగా మదురైలో నిర్వహించిన విజయ్ రోడ్ షోకు భారీ స్పందన లభించింది.
‘మేనమామ బంగారు ఉంగరం’ ప్రారంభించిన తమిళనాడు సిఎం..
28 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 12:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)