ఆంధ్ర 240/2 పంజాబ్‌తో రంజీట్రోఫీ
ఛండీగడ్: రంజీట్రోఫీ ఎలైట్ గ్రూప్-బిలో ఆంధ్ర జట్టు బ్యాటర్ షేక్ రషీద్(110) అజేయ శతకాని తోడు కరణ్ షిండే(73) అర్ధసెంచరీతో ఆదుకున్నారు. వీరిద్దరూ 2 వికెట్‌కు ఏకంగా 169 పరుగులు జతచేసి ఆంధ్ర జట్టు భారీస్కోర్‌కు దోహదపడ్డారు. అంతకుముందు పంజాబ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 592పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేయగా.. మూడోరోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు ఓపెనర్ జ్ఞానేశ్వర్(49) తృటిలో అర్ధసెంచరీని మిస్ చేసుకోగా.. మరో ఓపెనర్, వికెట్ కీపర్ రేవంత్ రెడ్డి(3) నిరాశపరిచాడు. వీరిద్దరూ ఔటయ్యాక రషీద్, కరణ్ షిండే మరో వికెట్ పడకుండా క్రీజ్‌లో పాతుకుపోయారు. ఆంధ్ర జట్టు ఇంకా 252 పరుగులు వెనుకబడి ఉంది. పంజాబ్ బౌలర్లు హర్‌ప్రీత్ బ్రార్, గుర్మన్‌సింగ్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.
హైదరాబాద్ లక్ష్యం 259పరుగులు
జింఖానా గ్రౌండ్ వేదికగా ఛత్తీస్‌గడ్‌తో జరుగుతున్న రంజీట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. మూడోరోజు ఆట నిలిచే సమయానికి హైదరాబాద్ జట్టు 13 పరుగులకే 2వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఛత్తీస్‌గడ్ రెండో ఇన్నింగ్స్‌లఓ మయాంక్ శర్మ(81), సంజీత్ దేశాయ్(51)కి తోడు 11వ నంబర్ బ్యాటర్ ధర్మేంద్ర సింగ్ జడేజా(38) బ్యాటింగ్‌లో రాణించారు. దీంతో హైదరాబాద్ జట్టు 68.4ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లు రక్షన్, అనికేత్ రెడ్డికి మూడేసి, రుత్విక్‌కు రెండు వికెట్లు దక్కాయి.








కామెంట్‌లు (0)