బెంగళూరు: భారత 16ఏళ్ల యువ స్విమ్మింగ్ ధినిధి దేశింగు సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. బెంగళూరుకు చెందిన ధీనిధి సెనెగల్ లోని డాకర్ లో జరుగుతున్న యూత్ ఒలింపిక్ లో కాంస్య పతకం సాధించింది. మహిళల 100 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో 56.27 సెకన్లలో గమ్యానికి చేరి మూడోస్థానం నిలిచింది. ఈ క్రమంలోనే జాతీయ రికార్డు నెలకొల్పింది. అలాగే యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన స్విమ్మర్‌గా కొత్త చరిత్రను లిఖించింది. ధినిధి విజయం యావత్ దేశానికి గర్వకారణమని ఆమెకు మద్దతుగా నిలుస్తున్న బజాజ్ ఫిన్‌సర్వ్ పేర్కొంది. ధినిధి సాధించిన చారిత్రాత్మక కాంస్య పతకం దేశానికి గర్వకారణం. పెద్ద కలలు కనే ప్రతి యువ క్రీడాకారుడికి ఆమె విజయం స్ఫూర్తినిస్తుంది. వ్యక్తిగత ప్రతిభకు సమష్టి మద్దతు తోడైతే భారత క్రీడాకారులు ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులతో పోటీపడగలరని ఆమె నిరూపించింది అని ఆ ప్రకటనలో తెలిపింది.
Print Editionస్విమ్మింగ్‌లో ధినిధి కొత్త చరిత్ర
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 04, 2026, 10:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)