దేశవాళీ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు స్కోర్ బ్రద్దలు
ముంబయి: దేశవాళీ క్రికెట్‌లో చిన్మయ్ సుతార్ ప్రపంచ రికార్డు స్కోర్‌తో మెరిసాడు. రంజీ ట్రోఫీలో వ్యక్తిగతంగా 400 పరుగులు చేసి రికార్డుల్లోకెక్కిన సుతార్.. తాజాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఒక టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు కొట్టిన భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రంజీట్రోఫీ తొలి ఆరు ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు (834) చేసిన బ్యాటర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు బషీర్ షా (831) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. బషీర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో తన తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 831 పరుగులు చేస్తే.. ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు చిన్మయ్‌కు కేవలం 5 ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరమయ్యాయి. మిజోరం తరఫునే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిన్మయ్ తన తొలి ఐదు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 35, 99, 400 నాటౌట్, 125, 175 స్కోర్లు చేశాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో 175 పరుగులు చేయడంతో చిన్మయ్ ఈ భారీ రికార్డు సాధించాడు. చిన్మయ్ రికార్డు శతకం కారణంగా మిజోరం జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 9వికెట్ల నష్టానికి 571 పరుగులకు ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది.







కామెంట్‌లు (0)