మహిళల ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ విడుదల..
ముంబయి: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యుపిఎల్) సీజన్-2027 షెడ్యూల్ బుధవారం విడుదలైంది. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు టోర్నీ జరగనుంది. ఈ ఎడిషన్‌లో మొత్తం 22 మ్యాచ్‌లు వడోదర, ముంబయి వేదికలుగా జరుగనున్నాయి. ఒక్కో వేదిక 11 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో రెండుసార్లు ఛాంపియన్స్ ముంబయి ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ వడోదర వేదికగా జరగనుంది. ఫిబ్రవరి 5, 7న ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌లు ముంబయి వేదికగా జరగనున్నాయి. డబ్ల్యుపిఎల్ సీజన్-5 మ్యాచ్‌లన్నీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. కాగా, గత ఎడిషన్ ఫైనల్లో ఆర్సీబీ-ఢిల్లీ క్యాపిటల్స్ తలపడిన విషయం తెలిసిందే. ఉత్కంఠగా సాగిన ఆ ఫైనల్లో ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించి రెండోసారి ఛాంపియన్‌గా అవతరించింది. వరుసగా నాలుగో ఎడిషన్ ఫైనల్లోనూ ఓడిన ఢిల్లీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.








కామెంట్‌లు (0)