న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పివి సింధు ఐదేళ్ల తర్వాత బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ టోర్నీ చైనాలోని హాంగ్జౌ వేదికగా డిసెంబర్ 9 నుంచి 13 వరకు జరుగనుంది. చివరిసారిగా 2022లో సింధు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించినప్పటికీ, గాయం కారణంగా చివరి నిమిషంలో తప్పుకుంది. అంతకుముందు 2021 బిడబ్ల్యుఎఫ్ ఫైనల్లో సింధు.. దక్షిణ కొరియా షట్లర్ అన్ సె యంగ్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. సింధు 2018లో తొలిసారి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆతర్వాత 2019, 2020లో గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2022లో అర్హత సాధించినప్పటికీ ఎడమ చీలమండ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగింది. మళ్లీ అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ.. ఐదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ టూర్‌కు అర్హత సాధించడం విశేషం. ఈ ఏడాది ఇప్పటికే జపాన్, హైలో ఓపెన్ టైటిళ్లు గెలిచి, ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సింధు.. ర్యాంకింగ్స్‌లోనూ టాప్-8లో నిలిచి మెగా టోర్నీకి అర్హత సాధించింది. బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ టూర్ టైటిల్ ర్యాంకింగ్స్‌లో టాప్-8 షట్లర్ల మధ్య జరగనుంది.
Print Editionఐదేళ్ల తర్వాత బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్‌కు సింధు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 04, 2026, 11:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)