శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేటి నుంచి మూలపాడులో ఆంధ్ర × హైదరాబాద్‌ రంజీ మ్యాచ్‌

1 గంట క్రితం

staduim
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 01:05 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయవాడ స్పోర్ట్స్‌ : మూలపాడు క్రికెట్‌ స్టేడియంలో ఆదివారం నుంచి ఆంధ్ర, హైదరాబాద్‌ జట్ల మధ్య రంజీట్రోఫీ మ్యాచ్‌ జరగనుంది. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఎసిఎ) ఆధ్వర్యంలో జరిగే రంజీట్రోఫీ తొలి సీజన్‌ మ్యాచ్‌లు మూలపాడులో జరగనున్నాయి. రంజీట్రోఫీ తొలి సీజన్‌లో భాగంగా కెఎల్‌ రాహుల్‌ సారథ్యంలో కర్ణాటకతో జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు అద్భుత ప్రదర్శనతో రాణించింది. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత సంపాదించిన ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు మూడు పాయింట్లు దక్కాయి. రెండో లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ సారథ్యంలోని హైదరాబాద్‌తో ఢీకొట్టనుంది. రంజీమ్యాచ్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) సెక్రటరీ సానా సతీష్ బాబు తెలిపారు. స్టేడియంలో ఏర్పాట్లు, పిచ్‌, మౌలిక వసతులు, ఆటగాళ్లకు అవసరమైన అన్ని సౌకర్యాలతోపాటు కట్టుదిట్ట భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. అలాగే మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇక రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో ఈ సీజన్‌లో మూలపాడు క్రికెట్ స్టేడియం రెండు కీలక మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. తొలి మ్యాచ్‌ 11 నుంచి 14 వరకు ఆంధ్ర–కర్ణాటక జట్ల మధ్య జరగ్గా.. రెండో మ్యాచ్‌ 18 నుంచి 21 వరకు ఆంధ్ర–హైదరాబాద్ జట్ల మధ్య జరగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్