శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అంగన్‌‌వాడీల వేతనాలు పెంచాలి..

25 సెప్టెంబర్, 2026

అంగన్‌‌వాడీల వేతనాలు పెంచాలి
- పలు సంఘాల డిమాండ్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 09:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- పలు సంఘాల డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు వేతనాలు పెంచాలని, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వర్కర్లకు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ అక్టోబరు 2న గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు, 6న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిల వద్దకు సామూహిక రాయభారాలు నిర్వహించాలని అంగన్‌‌వాడీ వర్కర్స్‌ అండ్‌ ‌హెల్పర్స్‌ ‌యూనియన్లు నిర్ణయించాయి. విజయవాడలోని ప్రెస్‌‌క్లబ్‌‌లో ఎపి అంగన్‌‌వాడీ వర్కర్స్‌ అండ్‌ ‌హెల్పర్స్‌ ‌యూనియన్‌ (‌సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ, ఎపి అంగన్‌‌వాడీ వర్కర్స్‌ అండ్‌ ‌హెల్పర్స్‌ ‌అసోసియేషన్‌ (‌ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె లలితమ్మ, ఎపి ప్రగతిశీల అంగన్‌‌వాడీ వర్కర్స్‌ అండ్‌ ‌హెల్పర్స్‌ ‌యూనియన్‌ (‌ఐఎఫ్‌‌టియు) రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మావతి సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన విలేకరు సమావేశంలో మాట్లాడారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు 2019 నుంచి వేతనాలు పెంపు లేదన్నారు. ఈ కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, అంగన్వాడీలకు రకరకాల యాప్‌లు తెచ్చి పనిభారం పెంచారని తెలిపారు. వేతనాలు పెంచాలని చేసిన అనేక పోరాటాలు ఫలితంగానే 2024 జులైలో వేతనాలు పెంచుతామని మినిట్స్ కాపీ ఇచ్చారని, 2026 మార్చి 2 ఆందోళన తరువాత 10న ఆ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. అంగన్వాడీ యూనియన్ నాయకులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరలోనే వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. కాని ప్రభుత్వంలో నేటికీ ఎటువంటి స్పందన లేదన్నారు. ఇటీవల ఉద్యోగులందరికీ పిఆర్‌‌సి వేస్తామని ప్రకటన చేశారని, వెంటనే అంగన్వాడీలకు కనీస వేతనాలు, ఇఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆయా సంఘాల నాయకులు టి గజలక్ష్మి, కె ప్రేమ, పార్వతి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్