- రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఢిల్లీరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు మరో అవకాశం ఉందని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు జరిగే క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ (దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ) సమయంలో ఫారం-19 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 13,985 ఫారం-19 దరఖాస్తులు అందగా, కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15,067 దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. ఆఫ్‌లైన్‌లో అందిన ఫారం-19 దరఖాస్తులన్నింటినీ సోమవారం అర్ధరాత్రి 12 గంటలలోగా తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో డిజిటలైజ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకోసం పోర్టల్‌ను సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు మూసివేయనున్నట్లు తెలిపారు. పూర్వపు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 11 జిల్లాల డిఇఒలు, ఇఆర్ఒలు దరఖాస్తుల నమోదుపై సమీక్ష నిర్వహించాలని సూచించారు. డిజిటలైజేషన్ కోసం ఒక్క ఫారం-19 దరఖాస్తు పెండింగ్‌లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.








కామెంట్‌లు (0)