మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు చాగల్లు విద్యార్థులు

20 నిమిషాల క్రితం

Students from Chagallu to participate in state level boxing competitions for the first time
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 12:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : గత నెల జరిగిన అండర్ 19 ఎస్జిఎఫ్ బాక్సింగ్ జిల్లా ఎంపికలలో చాగల్లు  విద్యార్థులు పాల్గొని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పి డి. జే విజయలక్ష్మి మంగళవారం ప్రజాశక్తికి తెలిపారు. చాగల్లు మండలం చాగల్లు జడ్పీ హైస్కూల్  నుండి బాక్సింగ్ పోటీలకు మొట్టమొదటిసారిగా వెళుతున్నారని తెలిపి హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 11వ తేదీ నుండి 13 వ తేదీ వరకు పిఠాపురంలో జరగనున్నాయని వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులను హెచ్ఎం.ఎస్ వాసవి, ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామస్తులంతా కలిసి అభినందనలు తెలుపుతూ, రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా విజయం సాధించాలని ఆశించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్