మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పార్టీ ఫిరాయించిన నలుగురు మాజీ అన్నాడిఎంకె ఎమ్మెల్యేలపై మరోసారి విచారణ

17 నిమిషాల క్రితం

Tamil Nadu Speaker
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 12:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : తమిళనాడులో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు ఎదుర్కొంటున్న నలుగురు మాజీ అన్నాడిఎంకె ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్ మంగళవారం మరోసారి విచారణ ప్రారంభించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడిఎంకె అభ్యర్థులుగా గెలిచిన కొద్ది వారాలకే ఎసాక్కి సుబయ (అంబసముద్రం), ఎస్. జయకుమార్ (పెరుందురై), పి. సత్యభామ (ధరాపురం), మరకతం కుమారవేల్ (మధురాంతకం) తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి అధికార టివికెలో చేరారు. వీరిలో సత్యభామ, కుమారవేల్ అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టివికె అభ్యర్థులుగా పోటీ చేసి తిరిగి ఎన్నికయ్యారు. ఈ నలుగురి పార్టీ ఫిరాయింపులపై అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై గతంలో పలుమార్లు విచారణ జరిపిన స్పీకర్, అన్నాడిఎంకె వర్గం నుంచి వివరణలు కూడా స్వీకరించారు.

అక్టోబర్ 13న మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తాజా విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది. పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై రెండు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం చెన్నై సచివాలయంలో జరిగిన విచారణకు సుబయ, జయకుమార్ హాజరయ్యారు. అన్నాడిఎంకె తరఫున పార్టీ విప్ అగ్రి ఎస్.ఎస్. కృష్ణమూర్తి, ఎన్. తలవై సుందరం, ఎంపి ఐ.ఎస్. ఇన్బదురై పాల్గొన్నారు. ఈ విచారణ ప్రక్రియ మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్