ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రూ.1,400 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదలపై ఎపి ఛాంబర్స్ హర్షం వ్యక్తం చేసింది. ఎంఎస్ఎంఇలకు ఊరట ఇస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఛాంబర్స్ రాష్ట్ర అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రూ.1,400 కోట్లలో ఆహార శుద్ధి పరిశ్రమలకు రూ.22 కోట్లు విడుదల కూడా ఉండటం విశేషమని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. నిధుల విడుదల ద్వారా పరిశ్రమలకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు లభించడంతో పాటు, వర్కింగ్ క్యాపిటల్ మెరుగుపడి, వాటి కార్యకలాపాలు పెరిగేందుకు దోహదపడుతుందని వివరించారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.








కామెంట్లు (0)