బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పునరుత్పాదక ఇంధన రంగంలో ఎపి కీలకం

13 నవంబర్, 2026

పునరుత్పాదక ఇంధన రంగంలో ఎపి కీలకం
-	2030 నాటికి 500 గిగావాట్ల కాలుష్య రహిత విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యం
- కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 09:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- 2030 నాటికి 500 గిగావాట్ల కాలుష్య రహిత విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యం

- కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి

విశాఖ: పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ కీలక కేంద్రంగా ఎదుగుతోందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. విశాఖలో జరుగుతున్న 31వ సిఐఐ భాగస్వామ్య సదస్సులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ... పునరుత్పాదక ఇంధన రంగంలో కుదిరిన 17 అవగాహన ఒప్పందాలు, మూడు ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా రూ.43,871 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, సుమారు 4,700 మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. దేశంలో విద్యుత్తు గరిష్ట డిమాండ్‌ 2012లో 123 గిగావాట్లు కాగా ప్రస్తుతం 270 గిగావాట్లకు పెరిగిందని, అయినప్పటికీ అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 7.86 లక్షల ఇళ్లకు రూఫ్‌టాప్‌ సోలార్‌ సదుపాయం కల్పించామని, పిఎం సూర్యఘర్‌ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా 66 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని వెల్లడించారు. 2014లో దేశ సౌర విద్యుత్తు సామర్థ్యం 2.8 గిగావాట్లు ఉండగా, ప్రస్తుతం 175 గిగావాట్లకు చేరిందన్నారు. మొత్తం విద్యుత్తు స్థాపిత సామర్థ్యంలో శిలాజేతర ఇంధన వనరుల వాటా 55 శాతానికి పెరిగిందని, 2030 నాటికి 500 గిగావాట్ల కాలుష్య రహిత విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు. పిఎం కుసుమ్‌-2 పథకం ద్వారా వ్యవసాయ పంపులకు సౌర విద్యుత్‌ సదుపాయాన్ని మరింత విస్తరిస్తామని తెలిపారు. రాజకీయ స్థిరత్వం, విధానాల కొనసాగింపు కారణంగా ఆంధ్రప్రదేశ్‌ స్వచ్ఛ ఇంధన రంగంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉందని, గ్రీన్‌ ఎనర్జీతో భారతదేశం ప్రపంచ తయారీ రంగంలో మరింత బలపడుతుందని ప్రహ్లాద్‌ జోషి విశ్వాసం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్