బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాహుల్‌గాంధీపై అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాల నిలిపివేత

11 నిమిషాల క్రితం

Rahul Gandhi.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 03:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలకు సంబంధించి సిబిఐ, ఈడి విచారణ చేపట్టాలంటూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు బుధవారం నిలిపివేసింది. తనపై ఆధారాలు లేని విచారణకు ఈ మధ్యంతర ఉత్తర్వులు పచ్చజెండా ఊపినట్లుగా ఉన్నాయని రాహుల్‌గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీలులో, తనను ఈ కేసులో ప్రతివాదిగా చేర్చకుండా, తన వాదన వినకుండానే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. ఈ కేసులో రాహుల్‌గాంధీని ప్రతివాదిగా చేర్చుకోవాలని ఆదేశించింది. కేసును తిరిగి హైకోర్టుకు పంపిస్తూ, మొదటి నుంచి విచారణ చేపట్టాలని సూచించింది. తాము ప్రస్తుతం ప్రాథమిక విచారణ దశలోనే ఉన్నామని, కేసు మెరిట్స్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని సీజేఐ స్పష్టం చేశారు.

ఫిర్యాదుదారు విఘ్నేష్‌ శిశిర్‌ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడని, గతంలోనూ తనపై అనేక ఫిర్యాదులు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్‌) దాఖలు చేశారని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. అయితే, వాటిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. విదేశీ పౌరసత్వం కలిగి ఉన్నారనే ఆరోపణల నుంచి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల వరకు అనేక అంశాలపై ఫిర్యాదులు చేశారని తెలిపారు. దురుద్దేశపూరిత వ్యక్తులు ఆధారాలు లేని ఆరోపణలతో తనపై పదేపదే ఒకే తరహా కేసులు దాఖలు చేయడం వెనుక నిరంతరం వేధించాలనే ఉద్దేశం ఉందని రాహుల్‌గాంధీ తన అప్పీలులో పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్