శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పలు పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగించిన ఎపిపిఎస్సి

6 రోజుల క్రితం

group
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 08:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ ‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌(ఎపిపిఎస్సి) పలు పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ నెల 26వ తేదితో ముగుస్తున్న గడువును డిసెంబర్‌ 7‌వ తేది వరకు అవకాశం కల్పిస్తునట్లు ఎపిపిఎస్సి కార్యదర్శి ‌పటాన్‌శెట్టి రవిసుభాష్‌ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఇంజనీరింగ్‌ ‌సర్వీస్‌‌లోని అసిస్టెంట్‌ ఎగ్జీక్యూటీవ్‌ ఇంజనీర్‌(ఎఇఇ), గనుల శాఖలోని అసిస్టెంట్ డైరెక్టర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు, ఎక్సైజ్ శాఖలోని అసిస్టెంట్‌ ‌కెమికల్‌ ఎగ్జామీనర్‌ ‌పోస్టులకు, ట్రాన్స్‌‌పోర్ట్‌ ‌సర్వీస్‌‌లోని అసిస్టెంట్‌ ‌మోటార్‌ ‌వెహికల్‌ ఇన్‌‌స్పెక్టర్‌ ‌పోస్టులకు గడువును కమిషన్‌ ‌పొడిగించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్