శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికల అధికారి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి

11 నిమిషాల క్రితం

Unidentified individuals attack election official
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 05:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రభుత్వ వాహనం ధ్వంసం - సెల్‌ ఫోన్లు దొంగతనం


ప్రజాశక్తి-వి.కోట (చిత్తూరు) : మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామపంచాయతీ ఎన్నికల విధి నిర్వహణలో పాల్గొన్న ఎన్నికల అధికారి వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడి ప్రభుత్వ వాహనాన్ని ధ్వంసం చేసి సెల్ఫోన్ లను అపహరించుకుని వెళ్లిన సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. స్థానిక సీఐ సోమశేఖర్ రెడ్డి కథనం మేరకు ... గురువారం రాత్రి కృష్ణాపురం గ్రామపంచాయతీ ఎన్నికలలో మొత్తం 12 వార్డులకు గాను ఎనిమిది వార్డులు వైసిపి మద్దతుదారులు, నాలుగు వార్డుల్లో టిడిపి మద్దతుదారులు విజయం సాధించారు. అనంతరం సర్పంచ్ ఓట్ల లెక్కింపులో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్తి విజయం సాధించారని ప్రకటించారు. దీనితో ఆగ్రహించిన వైసిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మద్దతుదారులు ఎన్నికల్లో వార్డులు తామే గెలిచామని సర్పంచ్ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని భ్రమించి ఎన్నికల విధుల్లో పాల్గొన్న నోడల్ అధికారి పరమేశ్వరన్ ప్రయాణిస్తున్న కారుపై దాడికి దిగారు. పెద్దపెద్ద బండరాళ్లు కారుపై విసిరి కారు ముందు భాగాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. గాయపడిన ఎన్నికల అధికారి పరమేశ్వరన్ కు చెందిన 2 అధికారిక సెల్ఫోన్లను అపహరించుకుని వెళ్లినట్లు వారు తెలిపారు. అర్ధరాత్రి జరిగిన ఈ హఠాత్‌ పరిణామంతో గాయపడిన ఎన్నికల అధికారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దాడులకు పాల్పడిన బాధితులు ఎవరు, వారి వెనక వేరే ఎవరైనా ఉన్నారా ? ప్రేరేపించారా ? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ సంఘటనను మండలంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. నిజా నిజాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్