శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుప్పరకుండ్రం వివాదం : ఆలయ కమిటీని తొలగించిన సుప్రీంకోర్టు

12 నిమిషాల క్రితం

Subramaniaswamy temple .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 05:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : తిరుప్పరకుండ్రంలోని అరుల్‌మిగు సుబ్రమణ్యస్వామి ఆలయ కమిటీని సుప్రీంకోర్టు శుక్రవారం తొలగించింది. తిరుప్పరకుండ్రంలో కొండపైన దర్గా సమీపంలోని దీపస్తంభంపై శనివారం మరోసారి కార్తీక దీపం వెలిగించాల్సిందిగా ఆదేశించింది. నవంబర్‌ 20న ఇచ్చిన కోర్టు ఆదేశాలను ఆలయ కమిటీ ఉద్దేశపూర్వకంగా, తీవ్రంగా ఉల్లంఘించిందని జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, జస్టిస్‌ విపుల్‌ ఎం. పంచోలిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. మాజీ జడ్జి ఎస్‌.వైద్యనాథన్‌, వి.పార్తిబన్‌ లతో కూడిన ద్విసభ్య కమిటీకి అరుల్‌మిగు సుబ్రమణ్యస్వామి ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. నంబర్‌ 24న వార్షిక కార్తీక దీపాన్ని దీపస్తంభంపై వెలిగించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకూడదని ఆలయ కమిటీ స్పష్టంగా నిర్ణయించుకుందని, ఇది తీవ్ర ఉల్లంఘన అని ధర్మాసనం పేర్కొంది. మదురైలోని తిరుప్పరకుండ్రంలో ఉచి పిళ్లయార్‌ ఆలయ సమీపంలో సాంప్రదాయ సిద్ధమైన ప్రాంతంలోనే కార్తీక దీపాన్ని వెలిగించాలని ఆలయ కమిటీ తీర్మానించిందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్