- పుట్టినరోజునే అంత్యక్రియలు
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విధి నిర్వహణలో ఉండగా జరిగిన కాల్పుల్లో అస్సాం రైఫిల్స్ జవాన్ వి.తేజ (31) ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలోని రాయగఢ్కు చెందిన తేజ ఐదేళ్లుగా అస్సాం రైఫిల్స్లో జవానుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల ఐదున అక్కడ జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖపట్నానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్లో స్వస్థలమైన ఒడిశా రాష్ట్రం రాయగఢ్కు తరలించనున్నారు. బుధవారం ఉదయం అధికారిక లాంఛనాలతో జవాన్ స్వస్థలంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తేజ పుట్టిన రోజునే అంత్యక్రియలు జరగనుండటంతో విషాదం నెలకొంది. మరోవైపు ఆయనకు రెండు నెలల్లో వాహం జరగాల్సి ఉంది. ఈ వివాహ ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలోనే ఆయన మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తేజ తల్లి గృహిణి, తండ్రి కిరాణా షాప్ నిర్వహిస్తున్నారు. కుమారుని మృతితో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారుభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తేజ తల్లి గృహిణి, తండ్రి కిరాణా షాప్ నిర్వహిస్తున్నారు. కుమారుని మృతితో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.








కామెంట్లు (0)