శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జిల్లాలోనే బైరెడ్డిపల్లికి ప్రథమ స్థానం

1 గంట క్రితం

chittur
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 04:02 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

82.45 శాతం పోలింగ్‌తో చిత్తూరు జిల్లాలో రికార్డు

మీడియా మిత్రులకు ప్రత్యేక అభినందనలు తాసిల్దార్ ప్రసన్నకుమార్

ఎన్నికల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ అధికారుల కృతజ్ఞతలు

ప్రజాశక్తి - బైరెడ్డిపల్లి : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బైరెడ్డిపల్లి మండలం చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా 82.45 శాతం పోలింగ్ నమోదు చేసి ప్రథమ స్థానంలో నిలిచిందని రిటర్నింగ్ అధికారి ఎన్. వెంకట్రాముడు తెలిపారు. మండలంలోని 58 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అభినందనీయమన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఆర్‌ఓ, తహసీల్దార్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. మండలంలో అధిక పోలింగ్ శాతం నమోదుకు ఎన్నికల యంత్రాంగం ముందస్తుగా చేపట్టిన ఏర్పాట్లు ఎంతగానో దోహదపడ్డాయని పేర్కొన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఏర్పాటు చేయడంతో పాటు, ప్రతి ఓటరికి ఓటరు స్లిప్పులు చేరేలా ఇంటింటికీ పంపిణీ చేయడం వల్ల ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాలను సులభంగా గుర్తించి ఓటు హక్కును వినియోగించుకోగలిగారన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి పోలింగ్ ముగిసే వరకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించారని తెలిపారు.

ఎన్నికల నిర్వహణలో పోటీ చేసిన అభ్యర్థులు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల నిబంధనలను పాటిస్తూ సహకరించడం, ఓటర్లు బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమన్నారు. ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు శాఖ అందించిన సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ మీడియా ప్రతినిధులు అందించిన సహకారాన్ని అభినందించారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు, జోనల్, రూట్ అధికారులు, పీడీఓలు, బీఎల్‌ఓలు, ఓటరు స్లిప్పుల పంపిణీలో పాల్గొన్న క్షేత్రస్థాయి సిబ్బంది కృషి మరువలేనిదన్నారు. ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం వల్లే మండలంలో అత్యధిక పోలింగ్ శాతం సాధ్యమైందని తెలిపారు.


ఎంపీటీసీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం : అలపల్లి 84.52, బైరెడ్డిపల్లి–1 73.85, బైరెడ్డిపల్లి–2 86.57, బేలుపల్లి 79.90, చప్పిడిపల్లి 88.85, దేవదొడ్డి 82.69, ధర్మపురి 84.36, గొల్లచీమనపల్లి 75.38, కడపనత్తం 82.18, కమ్మనపల్లి 86.39, లక్కనపల్లి 84.97, ఎం.కొత్తూరు 74.65, నెల్లిపట్ల 84.52, పాతపేట 87.11, తీర్థం 87.58, వెంగంవారిపల్లి 85.54 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మండలంలో 82.45 శాతం పోలింగ్ నమోదు కావడం ఎన్నికల యంత్రాంగం సమష్టి కృషికి నిదర్శనమని, ప్రజల భాగస్వామ్యం, అధికారుల సమన్వయం, పోలీసుల సహకారం, మీడియా పాత్రతో ఎన్నికల నిర్వహణ విజయవంతమైందని తహసీల్దార్ ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ మరోసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్