శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫ్రాన్స్‌లో బస్సు ప్రమాదం.. మైనర్‌ సహా ఇద్దరు మృతి

1 గంట క్రితం

France
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 05:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పారిస్‌ : ఫ్రాన్స్‌లో పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 16మందికి గాయాలైనట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

తూర్పు ఫ్రాన్స్‌లో శుక్రవారం ఉదయం పాఠశాలకు విద్యార్థులను తీసుకువెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. లియాన్‌కు ఈశాన్యంగా ఉన్న గ్రామీణ ప్రాంతంలోని లెంట్ అనే చిన్న పట్టణం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ బస్సులో చిన్న వారితో పాటు ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నారని రవాణా శాఖ మంత్రి ఫిలిప్‌ టబరోట్‌ తెలిపారు. ఇద్దరు మరణించగా, 16మంది గాయపడ్డారని అన్నారు. మరణించిన వారిలో మైనర్‌ విద్యార్థి ఉన్నారని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్