శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తుపానులతో తీవ్రంగా నష్టపోతున్న కోస్తా రైతులు : ఎపి సిఎం

1 గంట క్రితం

ap cm-2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 04:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కాకుమాను : తుపానుల కారణంగా కోస్తా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. తుపాను వలన నష్టం తగ్గించేందుకు ముందు జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. పంటల బీమా కట్టాలని ప్రతి రైతును కోరుతున్నామని, మొన్నటి వరకు ఎల్‌నినోతో ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు వరుస తుపానులు దెబ్బతీశాయని అన్నారు. వరుసగా రెండు తుపానులు రావడం చరిత్రలో ఇదే మొదటి సారని సిఎం చంద్రబాబు అన్నారు. మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఆయన ఏరియల్‌ సర్వే నిర్వహించారు. బాపట్ల, గుంటూరు జిల్లాల పర్యటనకు వెళ్తున్న సమయంలో హెలికాఫ్టర్ ద్వారా పంట నష్టాన్ని పరిశీలించారు. హెలికాప్టర్‌లో సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దిగి.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బాపట్ల మండలం జిల్లెలమూడి వంతెన వద్దకు చేరుకున్నారు. మురసు తుపానుకు గండ్లు పడిన డ్రెయిన్‌ను పరిశీలించి.. నీటిపారుదలశాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి గుంటూరు జిల్లా కాకుమాను మండలం రేటూరు గ్రామానికి చేరుకుని దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. డ్రెయిన్లకు గండ్లు పడిన కారణంగా నీట మునిగిన వరి పొలాలను పరిశీలించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్