ఎపిసిపిడిసిఎల్ సిఎమ్‌డి పుల్లారెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘అక్వాన్’ ప్రభావంతో విద్యుత్ సరఫరా వ్యవస్థకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎపిసిపిడిసిఎల్ సిఎమ్‌డి పి పుల్లారెడ్డి సూచించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసర సహాయం కోసం 1912 టోల్‌ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు జిల్లాల వారీ కంట్రోల్ రూమ్ నెంబర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కృష్ణా 6281709355, ఎన్‌టిఆర్ 9440817561, గుంటూరు 9440817526, బాపట్ల 9281413774, ప్రకాశం 9440817491, పల్నాడు 7382623148, మార్కాపురం 7780420711, సిఆర్‌డిఎ 8331092947 నెంబర్లను సంప్రదించాలన్నారు.







కామెంట్‌లు (0)