బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిదేశీ ఏజెంట్ల పట్ల అప్రమత్తం

1 గంట క్రితం

ap govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 10:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రాష్ట్ర ప్రభుత్వం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రష్యా సైన్యంలో ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తున్న ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన యువతను కొన్ని ప్రైవేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు, అక్రమ ఏజెంట్లు మోసపూరితంగా ఉద్యోగాలు, అధిక వేతనాలు, మెరుగైన ఉపాధి అవకాశాల పేరుతో విదేశాలకు పంపిస్తున్నట్లు సమాచారం అందుతోందని పేర్కొంది. విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికి, యువతను రష్యాకు పంపిన అనంతరం వారిపై ఒత్తిడి తెచ్చి సైన్యంలో చేరేలా చేస్తున్నట్లు, అధిక వేతనాల ఆశ చూపడం, తప్పుడు కేసుల్లో ఇరికించి బలవంతంగా సైనిక కార్యకలాపాల్లో పాల్గొనేలా చేస్తుండటం వంటి పలు ఆందోళనకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువత, విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అనుమానాస్పద ఆఫర్లు, ఏజెంట్లు లేదా సంస్థల వివరాలను సంబంధిత ప్రభుత్వ అధికారులకు, పోలీసు శాఖకు తెలియజేయాలని కోరింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్